Judges 14:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఏడవదినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
విందులోని కడమ యేడు రోజులూ సమ్సోను భార్య ఏడుస్తూ కూర్చుంది. చివరికతను సమాధానం చెప్పాడు. ఏడవ రోజున ఆ విప్పుడుకథకు సమాధానం తెలియజేశాడు. ఆమె తనను వేధించుకు తినడంవల్ల ఆమెకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆమె తన మనుష్యుల వద్దకు వెళ్లి, విప్పుడుకథకు సమాధానం చెప్పింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏడవదినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.