Judges 14:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఏడవదినమున సూర్యుడు అస ్తమింపకమునుపు ఆ ఊరివారు తేనెకంటె తీపియైనదేది?సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడునా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “తేనె కంటె మధురమైనదేది? సింహంకంటె బలంకలది ఏది?” తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే మీరు నా విప్పుడుకథను పరిష్కరించి ఉండలేరు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏడవదినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు— తేనెకంటె తీపియైనదేది? సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడు— నా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు, “తేనె కంటే తియ్యగా ఉండేదేంటి? సింహం కంటే బలమైనదేది?” అందుకు సంసోను, “మీరు నా దూడ దున్నకపోతే నా పొడుపు కథను చెప్పే వారే కాదు” అన్నాడు.