Judges 15:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచిఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?” “వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచి–ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు–వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యూదా నుండి మూడువేలమంది పురుషులు ఏతాము బండలో ఉన్న గుహలోకి దిగి, సంసోనుతో, “ఫిలిష్తీయులు మనలను పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? మా మీదికి ఇంత ప్రమాదాన్ని ఎందుకు తెచ్చిపెట్టావు?” అని అన్నాడు. అతడు వారితో, “వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను!” అన్నాడు.