Judges 16:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు దెలీలాఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడునీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన యెడల సరి అని ఆమెతో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత దెలీలా, “మళ్లీ నువ్వు అబద్ధం చెప్పావు. నన్ను అవివేకిగా చేశావు. ఇప్పుడైనా చెప్పు, ఎవరైనా నిన్ను ఎలా బంధించగలరో.” అని సమ్సోనుతో చెప్పింది. “నా తలమీది వెంట్రుకలతో ఏడుజడలను అల్లగలిగి, వాటిని ఒక మేకుతో బిగించినట్లయితే అప్పుడు ఇతర మనుష్యుల్లా నేను బలహీనుణ్ణి అవుతాను” అని సమ్సోను చెప్పాడు. తర్వాత సమ్సోను నిద్రపోయాడు. అప్పుడు అతని తలమీది వెంట్రుకలను అల్లింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు దెలీలా–ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు దెలీలా సంసోనుతో, “అప్పుడు దెలీలా సంసోనుతో, ఈసారి కూడా నీవు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. నిన్ను ఎలా బంధించవచ్చో చెప్పు” అని అన్నది. అతడు జవాబిస్తూ, “బహుశ నా జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లితే వాటిని అనపసూదితో కట్టేస్తే నేను అందరు మనుష్యుల్లా బలహీనుడను అయిపోతాను” అని అన్నాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు దెలీలా అతని జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లి,