Judges 16:31 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివా రందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సర ములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అతని సోదరులు, తండ్రి ఇంటివారందరు అతన్ని మోసికొనివచ్చి అతన్ని జోరహుకును ఎష్తాయోలుకును మధ్యలో ఉన్న అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇశ్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు.