Judges 16:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మాటుననుండువారు ఆమెతో అంతఃపుర ములో దిగియుండిరి గనుక ఆమెసమ్సోనూ, ఫిలిష్తీ యులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కొంతమంది మగవాళ్లు పక్క గదిలో దాగి ఉన్నారు. దెలీలా సమ్సోనుతో ఇలా చెప్పింది; “సమ్సోనూ! ఫిలిష్తీయులు నిన్ను ఇప్పుడు పట్టుకోనున్నారు” అంది. కాని సమ్సోను సులభంగా ఆ వింటినారులు తెంచుకున్నాడు. అగ్నిలో మండిపోయిన దారంలా, బూడిదలా అవి తెగిపోయాయి. అందువల్ల ఫిలిష్తీయులు సమ్సోను బలానికిగల రహస్యాన్ని కనుగొనలేక పోయారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మాటుననుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లోపలి గదిలో మనుష్యులు దాక్కొని ఉన్నప్పుడు అతనితో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని ఆమె అతనితో అనగా అతడు నూలు పోగును మంట దగ్గర పెడితే తెగిపోయినట్లు ఆ వింటినారలను తెంపేశాడు. కాబట్టి అతని బలం యొక్క రహస్యం వెల్లడి కాలేదు.