Judges 19:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉప పత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమంటే ఏమో తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. మరియు అతని దాసిని కూడ బయటికి తీసుకు వస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు వారికి చేయవచ్చు. కాని మా యింటికి వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇదిగో, కన్యగా ఉన్న నా కుమార్తె అతని ఉంపుడుగత్తె ఉన్నారు, వారిని బయటకు తెస్తాను, మీరు వారిని వాడుకొని ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి. అయితే ఈ మనిషి పట్ల ఇంత అవమానకరమైన పని చేయకండి.”