Judges 19:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడు దినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చు కొనుచు అక్కడ నిలిచిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ స్త్రీ తండ్రి లేవీ వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామ అతనిని ఇంట ఉండమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి మూడురోజులున్నాడు. అతను తిని, త్రాగి, మామ ఇంట నిదురించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడుదినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె తండ్రి అనగా అతని మామ అతన్ని ఉండమని బలవంతం చేశాడు; కాబట్టి అతడు మూడు రోజులు అతని దగ్గరే తింటూ, త్రాగుతూ, పడుకుంటూ అక్కడే ఉన్నాడు.