Judges 20:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే ఇశ్రా యేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగ వలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలీయులు యెహోవావద్దకు వెళ్లారు. సాయంకాలందాకా విలపించారు. వారు యెహోవాను అడిగారు; “బెన్యామీను ప్రజలతో మళ్లీ మేము యుద్ధం చేయాలా? ఆ మనుష్యులు మా బంధువులు.” “వెళ్లి, వాళ్లతో యుద్ధం చేయండి” అని యెహోవా సమాధానమిచ్చాడు. ఇశ్రాయేలు మనుష్యులు ఒకరినొకరిని ప్రోత్సాహ పరుచుకున్నారు. మొదటి రోజున చేసినట్లుగా, వారు మళ్లీ యుద్ధానికి తరలి వెళ్లారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఇశ్రాయేలీయులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని మొదట రోజున ఉన్న చోటనే మళ్ళీ యుద్ధానికి బారులు తీరారు.