Judges 20:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఫినెహాసు యాజకునిగా వుండి దేవుణ్ణి సేవిస్తూ వున్నాడు. ఫినెహాసు ఎలీయాజరు కుమారుడు ఎలీయాజరు అహరోను కుమారుడు) ఇశ్రాయేలు ప్రజలు ఇలా అడిగారు: “బెన్యామీను ప్రజలు మా బంధువులు. మళ్లీ మేము వారిని ప్రతిఘటించడానికి వెళ్లవలెనా? లేకపోతే మేము యుద్ధం ఆపివేయవలెనా?” యెహోవా, “వెళ్లండి, రేపు వారిని ఓడించేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దాని ముందు నిలబడి సేవ చేసేవాడు.) వారు అడిగారు, “మేము వెళ్లి మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీద యుద్ధానికి వెళ్లాల వద్దా?” యెహోవా జవాబిస్తూ, “వెళ్లండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను” అన్నారు.