Judges 20:39 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులువీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీ యులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైనికుల్ని సుమారు ముఫ్పై మందిని చంపారు. అందువల్ల, బెన్యామీను మనుష్యులు ఇలా అన్నారు; “మునుపటివలె మేము జయిస్తున్నాము” కాని అప్పుడు ఒక పెద్ద పొగ మేఘం నగరంనుండి వెలువడింది. బెన్యామీను మనుష్యులు చుట్టూ తిరిగి పొగచూశారు. నగరమంతా దగ్ధమవుతోంది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం పరుగిడిపోవడం ఆపివేశారు. వారు చుట్టు తిరిగి యుద్ధం చేయసాగారు. బెన్యామీను ప్రజలు భయపడ్డారు. అప్పుడు తమకు భయంకరమైన విషయం జరిగినట్లుగా వారు తెలుసుకున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు–వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీయులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి యుద్ధం చేశారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులకు (దాదాపు ముప్పైమందిని) ప్రాణనష్టం కలిగిస్తూ, “మొదటి యుద్ధంలా మనం వారిని ఓడిస్తున్నాం” అని అన్నారు.