Judges 3:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరలా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, ఆయన బెన్యామీనీయుడైన గెరా కుమారుడు, ఎడమ చేతివాటం గలవాడైన ఏహూదును రక్షకునిగా వారి కోసం నియమించారు. అతన్ని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు పన్ను చెల్లించడానికి పంపారు.