Judges 6:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి ఆ ఊరివారునీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి ఆ ఊరివారు–నీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నగర ప్రజలు యోవాషుతో, “నీ కుమారుడు బయలు బలిపీఠాన్ని పడగొట్టి, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని పడద్రోసాడు కాబట్టి అతడు చావాలి. అతన్ని బయటకు తీసుకురా” అన్నారు.