Judges 8:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు జెబహు పల్మున్నాలుప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడు మని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపివేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంటెల మెడల మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు జెబహు సల్మున్నాలు–ప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడలమీదనున్న చంద్రహారములను తీసికొనెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే చేయు, మనిషిని బట్టి అతని శక్తి ఉంటుంది” అన్నారు. గిద్యోను ముందుకు వెళ్లి వారిని చంపి, వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.