Judges 9:48 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక అబీమెలెకు, అతని మనుష్యులందరు సల్మోను కొండ మీదికి వెళ్లారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలు నరికాడు. ఆ కొమ్మలను అతడు తన భుజాల మీద మోసుకుని వెళ్లాడు. అప్పుడు అబీమెలెకు తనతో ఉన్న మనుష్యులతో, “త్వరపడండి, నేను చేసిన పని చేయండి” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అబీమెలెకును అతనితోనున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్లనుండి పెద్దకొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొని–నేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు, అతనితో ఉన్న మనుష్యులందరు, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలను నరికి, తన భుజంపై పెట్టుకున్నాడు. తన మనుష్యులను ఆదేశిస్తూ, “త్వరపడండి! నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి!” అన్నాడు.