Lamentations 1:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది. మిక్కిలి శ్రమకు గురియై యూదా బందీ అయ్యింది. యూదా పరదేశీయుల మధ్య నివసిస్తూ ఉంది. ఆమెకు విశ్రాంతిలేదు. ఆమెను వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు. ఆ ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బాధ, కఠిన శ్రమ తర్వాత, యూదా చెరకు వెళ్లిపోయింది. ఆమె జనాంగాల మధ్య నివసిస్తుంది; ఆమెకు విశ్రాంతి స్థలం దొరకడం లేదు. ఆమెను వెంటాడే వారంతా ఆమె కష్టాల మధ్య ఆమెను దాటి వెళ్లిపోయారు.