Lamentations 1:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి. అందుకు కారణం సీయోనుకు నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే. సీయోను ద్వారాలు పాడుబడినాయి. సీయోను యాజకులు మూల్గుచున్నారు. సీయోను యువతులు పట్టుబడ్డారు. ఇదంతా సీయోనుకు భరింపరాని విషాదం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నియామక కూటములకు ఎవరును రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి, ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు. దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి, ఆమె యాజకులు మూలుగుతున్నారు, ఆమె యువతులు దుఃఖపడుతున్నారు, ఆమె తీవ్ర వేదనలో ఉంది.