Lamentations 2:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ శత్రువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు. వారు ఈలవేసి, నిన్నుజూచి పండ్లు కొరుకుతారు. “మేము వారిని మింగేశాము! నిజంగా మేము ఈ రోజుకొరకే ఎదురుచూశాము. చివరకు ఇది జరగటం మేము చూశాము” అని వారంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరువారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు –దాని మ్రింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ శత్రువులందరూ నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు. వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ, “మేము ఆమెను నాశనం చేశాము. ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది; దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.