Lamentations 2:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఓ సీయోను కుమార్తె ప్రాకారమా, నీ గుండెలు పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో! నీ కన్నీరు వాగులా పారనీ! నీ కన్నీరు మున్నీరై పారనీ! నీ కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు! నీ కండ్లకు విశ్రాంతి నివ్వకు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రజల హృదయాలు యెహోవాకు మొరపెడుతున్నాయి. సీయోను కుమారి గోడలారా, మీ కన్నీటిని నదిలా పగలు రాత్రి ప్రవహించనివ్వండి; మీకు మీరే ఉపశమనం కలిగించుకోవద్దు, మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వవద్దు.