Lamentations 4:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరి కైనను తోచియుండలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
జరిగిన దానిని ప్రపంచ రాజులెవ్వరూ నమ్మలేకపోయారు. ప్రపంచ ప్రజానీకం ఏది సంభవించిందో దానిని నమ్మలేకపోయింది. శత్రువులు యెరూషలేము నగర ద్వారాల గుండా లోనికి ప్రవేశింపగలరని వారు అనుకోలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరి కైనను తోచియుండలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
శత్రువులు, శత్రువులు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చని భూరాజులు నమ్మలేదు, ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు.