Leviticus 10:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్ల నెనుమీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్య మును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అహరోనుకు ఎలీయాజరు, ఈతామారు అనే ఇద్దరు కుమారులు ఇంకా బ్రతికి ఉన్నారు. అహరోనుతో, అతని ఇద్దరు కుమారులతో మోషే ఇలా అన్నాడు: “అగ్నిచే దహించబడిన బలులలో ధాన్యార్పణ కొంత మిగిలిపోయింది. ధాన్యార్పణంలోని ఆ భాగాన్ని మీరు తినాలి. అయితే అందులో పొంగే పదార్థం కలుపకుండా మీరు తినాలి. బలిపీఠం దగ్గరే దాన్ని తినాలి. ఎందుచేతనంటే ఆ అర్పణ అతి పరిశుద్ధం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను— మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే అహరోనుతో అతని కుమారులలో మిగతా వారైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు, “యెహోవాకు సమర్పించిన హోమబలిలో మిగిలిన భోజనార్పణ పులుపు లేకుండ తీసుకుని బలిపీఠం ప్రక్కన తినండి, ఎందుకంటే అది అతిపరిశుద్ధమైనది.