Leviticus 14:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థ బలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పవిత్ర పర్చబడాల్సిన ఆ వ్యక్తి కుడి చెవి కొనమీద యాజకుడు తన అరచేతిలోని నూనె కొంచెం పోయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద కుడి పాదం బొటనవేలి మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. అపరాధపరిహారార్థ బలి అర్పణపు రక్తం మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థబలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెలో కొంచెం శుద్ధి చేయబడవలసిన వ్యక్తి యొక్క కుడిచెవి యొక్క లోలాకుల మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడి పాదం యొక్క పెద్ద బొటనవ్రేలుపై, అపరాధపరిహారబలి పశువు రక్తం పైన ఉంచాలి.