Leviticus 15:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“స్రావంగల వాడు తన స్రావం నుండి పవిత్రునిగా చేయబడితే అతడు తన శుద్ధికోసం తానే ఏడు రోజులు లెక్కబెట్టుకోవాలి. అప్పుడు అతడు పారుతున్న నీటిలో తన బట్టలు ఉతుక్కొని, స్నానం చేయాలి. అతడు పవిత్రుడు అవుతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘స్రవిస్తున్న వ్యక్తి తన స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, అతడు తన శుద్ధీకరణ కోసం ఏడు రోజులు లెక్కించి తన బట్టలు ఉతుక్కోవాలి, మంచి నీటితో స్నానం చేయాలి, అప్పుడు అతడు పవిత్రంగా అవుతాడు.