Leviticus 17:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీరెందుకు ఇలా చేయాలి? ఎందుచేతనంటే దాని మాంసంలో ఇంకా రక్తం గనుక ఉంటే, ఆ జంతువు ప్రాణం దాని మాంసంలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా రక్తంతో ఉన్న మాంసం తినవద్దు. రక్తం తినే ఏవ్యక్తి అయినాసరే తన ప్రజలనుండి వేరు చేయబడాల్సిందే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దాని రక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.