Leviticus 19:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కోతకాలంలో మీరు మీ పంటకోసేప్పుడు, మొత్తం మీ పొలాల మూలవరకు కోసెయ్యకండి. ఒకవేళ గింజలు ఏమైనా నేలమీద పడితే ఆ గింజలు మీరు ఏరుకోగూడదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం యొక్క అంచులకు కోయవద్దు లేదా మీ పంట కోతల యొక్క పరిగెలను సేకరించవద్దు.