Leviticus 23:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు మీరు ఆ రొట్టె లతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమ మగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.