Leviticus 26:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన... ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘మీ కోసం విగ్రహాలను తయారుచేసుకోవద్దు లేదా ఒక బొమ్మను గాని పవిత్రమైన రాయిని గాని నిలుపకూడదు, దాని ముందు తలవంచడానికి చెక్కిన రాయిని మీ భూమిలో పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.