Leviticus 4:35 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహో వాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసివేసినట్టే, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు అర్పించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సమాధానబలి యొక్క గొర్రెపిల్ల నుండి క్రొవ్వును తీసినట్లే వారు సమస్త క్రొవ్వును తీస్తారు, యాజకుడు దానిని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.