Leviticus 5:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు గొఱ్ఱపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆ వ్యక్తి గొర్రెపిల్లను ఇవ్వలేకపోతే అతడు రెండు గువ్వలనుగాని, రెండు పావురాలను గాని తీసుకొని రావాలి. ఇవి అతని అపరాధ పరిహారార్థబలి. ఒకటి పాపపరిహారార్థ బలికోసం, మరొకటి దహన బలికోసం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘గొర్రెపిల్లను కొనలేని వారెవరైనా వారి పాపానికి జరిమానాగా రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను యెహోవా దగ్గరకు తీసుకురావాలి, వాటిలో ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసము.