Leviticus 6:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉద యమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించు చుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించు చుండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని మండుతూనే ఉండాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము —ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించుచుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించుచుండును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి.