Leviticus 8:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలి పీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు అహరోను అతని కుమారుల చేతుల్లోనుండి మోషే వాటిని తీసుకొన్నాడు. బలిపీఠం మీద దహనబలిగా వాటిని దహించాడు. కాబట్టి అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు అర్పణ అది. అది అగ్నితో అర్పించబడిన అర్పణ. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలిపీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత మోషే వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద ఉన్న దహనబలి మీదుగా ప్రతిష్ఠార్పణగా వాటిని కాల్చి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా అర్పించాడు.