Leviticus 9:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు నీవు ఇశ్రాయేలీయులతోమీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱపిల్లను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు నీవు ఇశ్రాయేలీయులతో–మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱెపిల్లను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారబలి కోసం లోపం లేని ఒక మేకపోతును దహనబలి కోసం లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి.