Luke 1:22 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలుచేయుచు, మూగవాడై యుండెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు.