Luke 19:45 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[45-46] ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో –నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, అక్కడ అమ్ముకునే వారిని తరమడం ప్రారంభించారు.