Luke 22:58 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కొంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు. “నేను వాళ్ళలో ఒకణ్ణి కాదు” అని సమాధానం చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచి–నీవును వారిలో ఒకడవనగా పేతురు— ఓయీ, నేను కాననెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, “నీవు కూడా వారిలో ఒకడివి” అన్నాడు. పేతురు, “నేను కాదు!” అన్నాడు.