Luke 22:70 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయనమీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు వారందరు–అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన–మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు. అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు.