Luke 3:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లోయలు పూడ్చివేయ బడుతాయి. కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి. వంకర బాటలు చక్కగా ఔతాయి. కరుకు బాటలు నునుపుగా ఔతాయి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి పర్వతం, కొండ సమం చేయబడుతుంది. వంకర త్రోవలు తిన్నగా, గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.