Luke 7:32 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
సంతవీధులలో కూర్చుండియుండిమీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు సంతలో కూర్చొని, ‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము. కాని మీరు నాట్యం చేయలేదు. మేము చనిపోయిన వానికోసం పాట పాడాము. కాని మీరు దుఃఖించలేదు.’ అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సంతవీధులలో కూర్చుండియుండి–మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సంతవీధుల్లో కూర్చుని, ‘మేము వేణువు ఊదాం, మీరు నాట్యం చేయలేదు, ఏడుపు పాట పాడాం, మీరేమో ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు వీధిలో ఆడుకుంటూ చాడీలు చెప్పుకునే చిన్న పిల్లల్లాంటివారు: “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, కాని మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, కాని మీరు ఏడవలేదు.’