Malachi 1:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. మరి అదీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! ఆ కానుకలు అతడు అంగీకరించడు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు గ్రుడ్డి జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? కుంటి దానిని, జబ్బుతో ఉన్న జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? అలాంటి వాటిని మీ అధికారికి ఇచ్చి చూడండి! అలాంటివి ఇస్తే స్వీకరిస్తాడా? అతడు నిన్ను అంగీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.