Malachi 3:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవియ్యగామేము దేనివిషయ ములో తిరుగుదుమని మీరందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరికి మీ వూర్వీకులు కూడా నన్ను అనుసరించటం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం?” అని మీరు అంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీపితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా–మేము దేనివిషయములో తిరుగుదుమని మీరందురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ పూర్వికుల కాలం నుండి మీరు నా శాసనాల విషయంలో త్రోవ తప్పి వాటిని పాటించలేదు. నా వైపుకు తిరగండి, అప్పుడు నేను మీవైపుకు తిరుగుతాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. “కాని మీరు, ‘మేము ఏ విషయంలో తిరగాలి?’ అని అడుగుతారు.