Matthew 9:33 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి–ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ దయ్యం వెళ్లగొట్టబడిన తర్వాత ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడి, “ఇలాంటిది ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు చూడలేదు” అని చెప్పుకొన్నారు.