Micah 1:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏల యనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం ఎదురుచూస్తూ నీరసించిపోయాడు. ఎందుకంటే యెహోవానుండి ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏలయనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మారోతు వాసులు బాధలో ఉన్నారు, ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే, ఎందుకంటే, యెహోవా దగ్గర నుండి కీడు వచ్చింది, అది యెరూషలేము ద్వారం వరకు వచ్చింది.