Micah 6:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తన జనులమీద యెహో వాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది. పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునా దులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి; భూమికి నిత్యమైన పునాదుల్లారా, ఆలకించండి. యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు; ఆయన ఇశ్రాయేలుపై అభియోగం మోపుతున్నారు.