Nahum 1:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను తీసివేస్తాను. నేను నీ కొరకు నీ సమాధిని తయారు చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియులేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: “నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు. నీ దేవతల గుడిలో ఉన్న ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను. నీవు నీచుడవు, కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.”