Nahum 1:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా రోషంగల దేవుడు! యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు. యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు. ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా రోషం గలవారు ప్రతీకారం తీర్చుకునే దేవుడు; యెహోవా పగ తీర్చుకునేవారు ఉగ్రత గలవారు. యెహోవా తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు, తన శత్రువులపై తన ఉగ్రతను వెళ్లగ్రక్కుతారు.