Nahum 2:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థల మేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమా యెను?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది? ఆడ, మగ సింహాలు అక్కడ నివసించాయి. వాటి పిల్లలు భయపడలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థలమేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమాయెను?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ? వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ? సింహం, ఆడసింహం, సింహం కూనలు ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది?