Nahum 2:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి అనేక మంది మనుష్యులను చంపింది. అతడు తన గుహను (నీనెవె) మానవకళేబరాలతో నింపివేశాడు. అతడు తాను చంపిన స్త్రీలతో తన గుహను నింపాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పెట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, చంపిన వాటితో తన నివాస స్థలాలను, వేట మాంసంతో తన గుహలను నింపింది.