Nahum 2:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కన బడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో అవి ముందుకు, వెనుకకు పోతున్నాయి. అవి మండే దివిటీల్లా, ఒక చోటనుండి మరొక చోటికి ప్రసరించే మెరుపుల్లా కనిపించాయి!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.