Nehemiah 1:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిు, నీ సేవకు డైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడల నైనను విధులనైనను మేము గైకొనక పోతివిు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నీవు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణీకరించాము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు.