Nehemiah 10:38 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ పంట భాగాలు లేవీయులు వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి చెందిన యాజకుడొకడు ఉండాలి. తర్వాత ఆ లేవీయులు ఆ పంటల్ని విధిగా ఆలయానికి తీసుకురావాలి. అప్పుడు వాటిని వాళ్లు ఆలయపు ఖజానాలోని సరుకుల కొట్లలో ఉంచుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండ వలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేవీయులు పదవ భాగాన్ని తీసుకునేటప్పుడు వారితో పాటు అహరోను వారసుడైన ఒక యాజకుడు ఉండాలని, లేవీయులు ఆ పదవ భాగాలన్నిటిలో పదవ భాగాన్ని మన దేవుని ఆలయ గిడ్డంగులకు ఖజానాకు తీసుకురావాలి.